మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయంటే మీరు తీసుకునే ఆహారం సరైనది కాదు అని తెలుపుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి నిత్యం తినే ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి.
మారుతున్న కాలానికి తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. ముఖ్యంగా రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వీటిలో ఉండే న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. మరి లో ఇమ్యూనిటిని పెంచుకోవడానికి కొన్ని సింపుల్ మార్గాలు...
స్వీట్ పొటాటో: స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. మరియు ఇందులో మ్యాంగనీస్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండి వ్యాధినిరోధకతను పెంచడంలో దోహదం చేస్తాయి.
బెర్రీస్: బ్లూ బెర్రీ మరియు రెడ్ గ్రేప్స్ స్ట్రాంగ్ కాంపోనెంట్స ఉంటాయి. శరీరానికి వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది.
మష్రుమ్స్: మష్రుమ్ లో మైటేక్ , రైషి, కొరియోలస్, అగరకస్, మరియు షిటేక్ వంటివి హెల్తీ మష్రుమ్స్ వ్యాధినిరోధక ఆహారాలుగా బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి . పవర్ ఫుల్ కాంపౌడ్స్ బీటా గ్లూకాన్స్ వంటివి మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
క్యారెట్స్: క్యారెట్ కంటికే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నిత్యం అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరుస్తాయి.
గార్లిక్: ప్రతి వంటకానికి రుచితో పాటు.. సువాసనను అందించే వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. మీ డైట్ లో వెల్లుల్లిని చేర్చుకుంటే.. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
కివి: కివి ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్. అయినా కూడా ఈ ఫ్రూట్ అందుబాటులో ఉన్నప్పుడు తీసుకుంటే చాలు సంవత్సరం అంతా కొన్ని ప్రధానమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు . ఈ ప్రూట్ తినడానికి కొద్దిగా పుల్లగా ఉన్నా, ఇందులో విటమిన్ ఇ మరియు ఎలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల వివిధ రకాల వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు . ఈ హాట్ సమ్మర్లో వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం.
ఆకుకూరలు: మీ శరీరానికి కావల్సిన అనేక విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీయాక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉండి. వ్యాధినిరోధకతను పెంపొంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
No comments:
Post a Comment