Monday, March 28, 2016

వాట్ ఏ మ్యాచ్: ట్విట్టర్‌లో కోహ్లీకి అనుకొని అతిథి ప్రశంస



న్యూఢిల్లీ: మొహాలిలో భారత్‌కు చిరస్మరణీయ విజయం. విరాట్ కోహ్లీ అద్భుతమై ప్రదర్శనను కనబర్చడంతో... ఆదివారం తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ధోని సేన 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 51 బంతుల్లో సాధించిన 82 పరుగులు (నాటౌట్) సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన టీమిండియా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయ లక్ష్యాన్ని ఛేదించి ధోని సేన సెమీస్‌కు చేరింది.


ఈ క్రమంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీపై ప్రధాని నరేంద్ర మోడీతో సహా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.



 సెమీఫైనల్లో కూడా భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ క్రికెటర్లు, పలుదేశాలకు చెందిన ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఆటతీరపై ప్రశంసలు కురిపించారు. తీవ్రఒత్తడిని ఎదుర్కొని భారత జట్టును విజయతీరాలకు చేర్చిన కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లిని స్వయంగా అభినందించారు. కాగా విరాట్ కోహ్లి ఆడిన అద్భుతైమన ఇన్నింగ్స్‌ను భారతరత్న, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ప్రత్యేకంగా అభినందించారు.

No comments:

Post a Comment