Wednesday, April 27, 2016

తొక్కేం కాదు అనుకోకండీ..

సాధారణంగా కొన్ని పండ్లను తొక్కలతోనే తినేస్తుంటాం. మరికొన్నింటినీ.. తొక్క తీసేసి తింటూ ఉంటాం. కొన్ని పండ్ల తొక్కలు టేస్టీగానే ఉన్నప్పటికీ.. కొన్ని తొక్కలు తినాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే.. అవి వగరుగా, రుచి లేకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్ల తొక్కలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో పడేయకుండా తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

పండ్లు పోషకాలయాలు. వాటిలో అనేక రకాల హెల్త్, బ్యూటీ బెన్ఫిట్స్ ఇమిడి ఉంటాయి. అయితే పండ్ల పోషకాల గురించి అందరికీ తెలిసిన విషయమే. కానీ.. పండ్ల తొక్కలలో కూడా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కొన్ని రకాల వ్యాధులను నయం చేసే సత్తా ఉందట. అందుకే.. ఏ పండు తొక్కలో ఏముందో తెలుసుకుందాం. ఏ పండు తొక్క తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు నివారించవచ్చో తెలుసుకుంటే.. ఇకపై తొక్కను నిర్లక్ష్యం చేయకుండా.. ఆరగించేస్తారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా..

పుచ్చకాయ తొక్క పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగంలో అనేక పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఈ పీల్ ని చర్మంపై రుద్దడం వల్ల చర్మంపై పేరుకున్న డర్ట్ తొలగిపోతుంది. అలాగే చర్మం డ్యామేజ్ కి లోనవకుండా.. అరికడుతుంది.

నారింజ తొక్క బరువు తగ్గడానికి నారింజ తొక్క సరైన పరిష్కారం. అలాగే ఇది న్యాచురల్ స్క్రబ్ లా, బ్లీచింగ్ లా చర్మంపై పనిచేస్తుంది. అలాగే పంటి ఆరోగ్యానికి, శ్వాససంబంధిత సమస్యలకు, కాన్స్టిపేషన్ నివారించడానికి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అలాగే ఆరంజ్ పీల్స్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.


దానిమ్మ తొక్క చూడగానే తినాలనిపించే దానిమ్మ గింజల్లోనే కాదు.. తొక్కలోనే ఆరోగ్య రహస్యాలున్నాయి. దానిమ్మ తొక్క యాక్నె, పింపుల్స్, రాషెష్, జుట్టు రాలడం, చుండ్రు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే హార్ట్ డిసీజ్, గొంతు నొప్పి నివారించడంలో దానిమ్మ తొక్క సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, పళ్ల పరిశుభ్రతకి ఉపయోగపడుతుంది.




అరటితొక్క అరటితొక్క లోపలి భాగంతో.. పంటిపై రుద్దడం వల్ల పళ్లు న్యాచురల్ గా తెల్లగా మారుతాయి. అలాగే అరటితొక్కను కాలిన చర్మంపై పెట్టడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పగిలిన పాదాలపై అరటితొక్కతో రబ్ చేయడం వల్ల.. వారంరోజుల్లో అమోఘమైన ఫలితాలు చూస్తారు.







దోసకాయ తొక్క చాలా సందర్భాల్లో దోసకాయ తొక్కలను పడేస్తుంటాం. లోపల ఉండే పదార్థంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తాం. కానీ.. తొక్కలోనే హై ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గిస్తుంది, అలాగే కాన్స్టిపేషన్ నివారిస్తుంది. అలాగే దోసకాయ తొక్కలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ కే ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, బ్లడ్ క్లాట్స్ నివారించడానికి, చూపు మెరుగుపరడానికి ఉపయోగపడుతుంది.

యాపిల్ తొక్క యాపిల్ తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు.. అయితే యాపిల్ తొక్క తినడం వల్ల ఫ్లేవనాయిడ్స్, కెమికల్స్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తాయి. ఇమ్యునిటీ పెంచుతుంది. యాపిల్ పీల్ లో ఒబేసిటీని తగ్గించే గుణం ఉంటుంది.



నిమ్మ తొక్క నిమ్మ తొక్కలో అనేక బ్యూటీ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలుసు. అలాగే ఇది చర్మంపై న్యాచురల్ మాయిశ్చరైజర్, క్లెన్సర్ లా పనిచేస్తుంది. అలాగే ఈ తొక్కలుబరువు తగ్గడానికి, పంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టాక్సిన్స్ ని బయటకు పంపి.. ఒత్తిడిని తగ్గిస్తాయి.

1 comment:

  1. విలువైన విషయాలు చెప్పారు ధన్యవాదాలు, మరి ఎలా వాడాలో అంటే కద్దూకస్ చేయాలా ముక్కలు చేయాలా ఆ ముక్కులు తినే యోగ్యంగా ఎలా చేయాలో కూడా చెప్పుంటే బాగుండేది. కొన్ని నమ్కీన్ గానూ, కొన్ని మీఠాగానూ చేయవచ్చు అని విన్నాను. కొన్ని పైపూతగానూ వాడచ్చుననుకుంటాను. కరెక్టేనా....

    ReplyDelete