Friday, January 22, 2016

అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

అక్రోటుకాయలు శరీరానికి కావలసియన పోషకాలను అందించటమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల పెరుగుదలను నియంత్రిస్తాయి. అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఇక్కడ తెలుపబడ్డాయి.



అక్రోటుకాయలు (వాల్నట్):

అక్రోటుకాయలు అనేవి సాధారణంగా అందరికి తెలిసిన పోషక విలువలు కలిగిన ఎండిన పండ్లు. అంతేకాకుండా, ఆరోగ్యాన్ని చాలా రకాలుగా పెంపొందిస్తుంది. అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ కొన్ని తెలుపబడ్డాయి.

రోగనిరోధక శక్తిని:

అక్రోటుకాయలు రోగ నిరోధక వ్యవస్థకు చాలా మంచివి. ఇవి ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన, శరీర నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచి వ్యాధులకు దూరంగా ఉండేలా సహాయం చేస్తుంది. మీ భోజనంలో వీటిని కలుపుకోవటం వలన నిరోధక వ్యవస్థకు చాలా మంచిది.

రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణ:

రక్తంలోని చక్కెర స్థాయిలకు సంబంధించిన సమస్యలను తగ్గించటంలో ఇవి సహయం చేస్తాయి. మీరు తినే భోజనంలో వీటిని కలుపటం వలన హృదయ నాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతుంది అని పరిశోధనలలో వెల్లడయింది.

రొమ్ము క్యాన్సర్:

విత్తనాలలో ఆరోగ్యాన్ని పెంపొందించే వాటిలో ఇది ముఖ్యమైనది మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉండి, రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తాయి. రొమ్ము క్యాన్సర్ కలిగి ఉన్న ఆడవారు మరియు దీనికి చికిత్స చేపించుకునే వారు రోజు ఒక కప్పు అక్రోటుకాయలు తినటం వలన, ఇవి శక్తివంతంగా రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయి.

గుండె ఆరోగ్యం:

అక్రోటుకాయలు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను పుష్కలంగా కలిగి ఉండి, హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతాయి. అక్రోటుకాయలు, రోజు తినటం వలన, రక్త పీడనం అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'ల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడి, గుండెను ఆరోగ్యకరంగా ఉంచే మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెంచుతుంది.

గర్భం :

గర్భ సమయంలో ప్రతి త్రైమాసిక దశలో పోషకాలు తప్పని సరిగా అవసరం. గర్భంతో ఉన్న స్త్రీలు రోజు తీసుకునే ఆహరంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు అధికంగా ఉండేలా చూసుకోండి. అక్రోటుకాయలు పుష్కలమైన ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉంటాయి ఇవి పిండ పెరుగుదలకు మరియు శిశువు ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, ప్రసవం ముందుగా అవకుండా, సరరైన సమయంలో ప్రసవం జరిగేలా చేస్తుంది.


జీవక్రియ: 

జీవక్రియకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా మితిమీరిన రక్తంలోని ఫాట్, అధిక రక్త పీడనం, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు మరియు స్థూలకాయత్వం వంటి వాటిని నియంత్రిస్తుంది. నూతన పరిశోధనల వెల్లడి ప్రకారం రోజు ఒక ఔన్స్ అక్రోటుకాయలను 2 నుండి 3 నెలల పాటు తినటం వలన జీవక్రియ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

పిత్తాశయ రాళ్ళు:

'హావర్డ్' అనే బృందం ప్రచురించిన దాని ప్రకారం, ఎవరైతే వారం పాటూ 1 ఔన్స్ అక్రోటుకాయలను తినటం వలన వారిలో పిత్తాశంలో రాళ్ళు ఏర్పడటం 25 శాతం తగ్గుతుంది అని తెలిపారు. వారంలో కొన్ని అక్రోటుకాయలను తినటం వలన పిత్తాశంలో రాళ్ళు ఏర్పడటం నుండి రక్షణ పొందవచ్చు.


బరువు తగ్గుదల:

సాధారణంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు విత్తనాలను తినరు కారణం-అందులో ఉండే క్యాలోరీలు, నూతన పరిశోధనల ప్రకారం వారంలో రెండు సార్లు విత్తనాలను తినటం వలన 31 శాతం వరకు బరువు పెరుగుదలను నియంత్రిస్తాయి అని తెలిపారు.

క్యాన్సర్ నియంత్రణ:

అక్రోటుకాయలు 'ఫైటోన్యూట్రీఎంట్స్'లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తాయి. ఒక కప్పు అక్రోటుకాయలను తినటం వలన చాలా రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

No comments:

Post a Comment