Monday, July 4, 2016

ఇలా చేస్తే పాదాల వాపు, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందా..?

పాదాల్లో వాపు సమస్య చాలామందిలో వింటూ ఉంటాం. బాడీ టిష్యూస్ లో ఫ్లూయిడ్స్ ఎక్కువ అయినప్పుడు .. పాదాల్లో వాపు వస్తుంది. నిజానికి పాదాల్లో వాపుకి.. రకరకాల కారణాలుంటాయి. అది వాపు వచ్చిన విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే.. ఈ సమస్య తరచుగా వస్తుంటే.. సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్ కి హెచ్చరిక అని గమనించాలి.
అలాంటప్పుడు డాక్టర్ ని సంప్రదించి కారణం తెలుసుకోవడం మంచిది. సాధారణంగా హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లు, గర్భిస్త్రీలలో ఎక్కువ పాదాల్లో వాపు కనిపిస్తుంది. అయితే ప్రాణానికేం ప్రమాదం కాదు.. కానీ.. అసౌకర్యంగా ఉంటుంది. నొప్పి కూడా వేధిస్తుంది.

ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్లు అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే.. రెగ్యులర్ గా హోం రెమిడీస్ ని ఫాలో అయితే.. ఖర్చు తక్కువ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందులోను ఇవి ఇంట్లోనే లభించే వస్తువులు. మరి పాదాల వాపు తగ్గించే ఎఫెక్టివ్ రెమిడీస్ చూద్దామా..


ఎసెన్షియల్ ఆయిల్ మసాజ్:
ఎసెన్షియల్ ఆయిల్ అంటే లావెండర్ ఆయిల్ లేదా పెప్పరమెంట్ ఆయిల్ తో.. పాదాల వాపు ఉన్నదగ్గర మసాజ్ చేయాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా మెరుగుపరిచి.. వాపుని తగ్గిస్తుంది.



దురదగొండి ఆకు:
దురదగొండి ఆకుల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఎలాంటి నొప్పి, వాపునైనా తేలికగా తగ్గిస్తాయి. 4 నుంచి 5 దురదగొండి ఆకులను ఒక గిన్నె మరుగుతున్న నీటిలో కలపాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఆ నీటిలో కప్పులోకి తీసుకోవాలి. ఈ నీటిని తాగుతూ ఉంటే.. రోజురోజుకీ.. నొప్పితోపాటు, వాపు తగ్గుతూ వస్తుంది.



యాపిల్ సైడర్ వెనిగర్:
ఈ న్యాచురల్ ఇంగ్రిడియంట్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. పాదాల్లో వాపుని వేగంగా తగ్గిస్తుంది. దీన్ని నీళ్లు, తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా.. ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని అందులో ముంచి తీసి.. వాపులు ఉన్న ప్రాంతంలో చుట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది.



ఎప్సమ్ సాల్ట్ :
ఇది వాపుని, ఫ్లూయిట్స్ ని తగ్గిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ని ఒక టబ్ గోరువెచ్చని నీటిలో కలిపి.. పాదాలను 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా నొప్పిని నివారిస్తుంది.



సింహదంటి ఆకులు:
ఆయుర్వేదంలో ఉపయోగించే సింహదంటి ఆకులతో ఒక కప్పు టీ చేసుకుని తాగడం వల్ల.. వాపు, నొప్పి నుంచి చాలా ఎఫెక్టివ్ గా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే.. గుణాలు.. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరిచి, నొప్పిని తగ్గిస్తాయి.


నిమ్మ, తేనె:
టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి రోజంతా తాగాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు.. వాపుని తగ్గిస్తాయి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.



ధనియాలు:
పురాతన కాలం నుంచి.. ధనియాలను నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తూ వస్తున్నాం. కొన్ని ధనియాలను ఒక గిన్నె నీటిలో ఉడికించాలి. ఈ నీటిని.. రోజంతా తాగుతూ ఉంటే.. గ్రేట్ రిలీఫ్ పొందవచ్చు.













No comments:

Post a Comment