Wednesday, June 8, 2016

పళ్లు తింటున్నారా... ఆగండి... ఈ సంగతి చూసుకోండి

ఆరెంజ్ చూస్తునే తినేయాలనిపిస్తుంది. కానీ అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల పుల్లగా ఉంటాయని చాలా మంది ఆరెంజ్ ను తినడానికి ఇష్టపడరు. కానీ ఆరెంజ్ లో ఉండే న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ గురించి తెలుసుకుంటే, తినకుండా ఉండరు. ఆరెంజ్ న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ కు ఒక పవర్ హౌస్ వంటిది. ఇవి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. 

ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రెగ్యులర్ గా ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ప్రపంచం మొత్తంలో ఉండే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడం, ఎనర్జీ లెవల్స్ ను పెంచుకోవడం, యంగ్ లుకింగ్ స్కిన్ తో కనబడాలన్నా, ఇటు ఆరోగ్యాన్ని, అటు బ్యూటీని మెరుగుపరుచుకోవాలంటే అందుకు ఆరెంజ్ ఒక గ్రేట్ ఫ్రూట్ . 



ఆరెంజ్ ను రెగ్యులర్ గా ప్రతి రోజూ తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మరియు చర్మ ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తుందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాబట్టి, ఆరెంజ్ ను అకేషనల్ గా ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మాత్రమే కాదు, రెగ్యులర్ గా రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. 



ఆరెంజ్ ను జ్యూస్ రూపంలో, సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిది. ఆరెంజ్ ను ప్రతి రోజూ ఎందుకు తినాలి? మన రెగ్యులర్ డైట్ లో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలేంటి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ తప్పనిసరిగా చదవాల్సిందే . అయితే ఏదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లైతే వెంటనే డాక్టర్ కు మీ హెల్త్ కండీషన్ గురించి చెప్పడం మంచిది..



1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: ఆరెంజ్ ను రెగ్యులర్ గా ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో ఎల్ డిఎల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఆరెంజ్ ను ప్రతి రోజూ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనడం జరిగింది.

2. కంటి చూపుకు చాలా మేలు చేస్తుంది : ఆరెంజ్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ డైట్ లో ఈ విటమిన్ సి ఫుడ్స్ ను చేర్చుకోవడం వల్ల ఐ కాంట్రాక్ట్స్, గ్లూకోమా వంటి వ్యాధులను నివారిస్తుంది.

3. హెల్తీ స్కిన్, అండ్ హెయిర్ ను పొందవచ్చు: ఆరెంజ్ సిట్రస్ ఫ్రూట్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల , చర్మం మరియు జుట్టుకు బహు విధాలుగా సహాయపడుతుంది. స్కిన్ కండీషన్స్ మొటిమలు, మచ్చలను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. ఆరెంజ్ ఫ్రూట్ లో కొల్లాజన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను గ్రేట్ గా ప్రోత్సహిస్తుంది . హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది.

4. వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది: మీరు తరచూ అనారోగ్యానికి గురి అవుతుంటే మీ రెగ్యులర్ డైట్ లో ఆరెంజ్ జ్యూస్ ను చేర్చుకోవాలి. సోలబుల్ ఫైబర్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ప్రూట్ రెగ్యులర్ గా తింటే శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది . వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. శరీరంను హానికరమైన బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఆరెంజ్ చేర్చుకుని ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా మార్చుకోండి..

5. హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది: ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ధమనుల్లో రక్తంలో హానికరమైన టాక్సిన్స్ ను నివారించే రక్తనాళాల్లో బ్లాకేజస్ లేకుండా, హార్ట్ సమస్యలు తలెత్తకుండా నివారిస్తుంది.

6. బ్లడ్ షుగర్ లెవల్స్ మ్యానేజ్ చేస్తుంది: డయాబెటిస్ ఉన్నవారు ఆరెంజ్ ఫ్రూట్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు . బ్లడ్ షుగర్ లెవల్స్ ను అండర్ కంట్రోల్లో ఉంచుతుంది . ఆరెంజ్ లో ఉండే ఫైబర్ కంటెంట్ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

7. బ్రెయిన్ డెవలప్ మెంట్ ను మెరుగుపరుస్తుంది: ఆరెంజ్ లో ఫైటోన్యూట్రీషియన్స్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి . బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరచడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది . మీ ఏకాగ్రతను పెంచుకోవాలాన్నా లేదా కొత్త విషయాలను నేర్చుకోవాలన్నా ఆరెంజ్ ఫూట్ ను మీ హెల్తీ ఫూట్ గా రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. 

No comments:

Post a Comment