Friday, June 10, 2016

మధ్యాహ్నం అలా చేస్తే ముప్పు తప్పదు...

హాయిగా నిద్రపోవడం వల్ల పొందే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. మనందరికీ తెలుసు.. మంచి నిద్ర ఎంత అవసరమో. ప్రతిరోజూ ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అయితే.. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి కదా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. ఖచ్చితంగా రాత్రిపూటే.. సరిపడా నిద్రపొందేలా జాగ్రత్త పడాలి.


అయితే చాలామంది ఈ నిబంధన పాటించరు. ఒకవేళ ఈ నియమాన్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అయితే.. మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్ మాదిరిగా పనిచేసి.. అనేక వ్యాధులు దూరంగా ఉండేలా చేస్తుంది. అయితే కొంతమందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ.. అది ఏమాత్రం మంచిది కాదు. పగటి పూట నిద్రపోయే అలవాటు.. కొత్త వ్యాధులను తెచ్చిపెడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు పగటి పూట ఎందుకు నిద్రపోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..



అలవాటు ధర్మ శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. దివస్వాపం చా వజ్రయేత్ అని శాస్త్రాల్లో వివరించారు. అంటే.. మధ్యాహ్నం పడుకోవడం సరైన అలవాటు కాదని అర్థం.



ఆడవాళ్లకు చాలామంది గృహిణులకు మధ్యాహ్నం నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. అలాగే షిఫ్ట్ ల ప్రకారం పనిచేసే మగవాళ్లకు కూడా పగలు నిద్రపోయే అలవాటు ఉంటుంది.



ఆయుర్వేదం ప్రకారం కేవలం శాస్త్రాలే కాదు.. ఆయుర్వేదం ప్రకారం కూడా పగటిపూట నిద్రపోకూడదు. ఒకవేళ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటే.. అనేక వ్యాధుల రిస్క్ ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది.

త్వరగా జలుబు పగటి పూట ఎక్కువ నిద్రపోయేవాళ్లకు, పగలు నిద్రపోని వాళ్లతో పోల్చితే త్వరగా జలుబు వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

లంగ్స్ కి సమస్య ఎక్కువగా జలుబు చేయడం మొదలైంది అంటే.. నెమ్మదిగా శ్వాససంబంధ సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఊపిరితిత్తులు నాశనం అవడానికి అవకాశం ఉంటుంది.

రాత్రిపూట 7 నుంచి 8 గంటలు రాత్రిపూట 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి, వర్క్ కి వెళ్లడానికి ముందు ఈ నిద్ర చాలా అవసరమని సైన్స్ చెబుతోంది.

శరీరానికి కావాల్సిన రెస్ట్ కేవలం రాత్రి నిద్ర మాత్రమే.. శరీరానికి సరైన విశ్రాంతి అందించడంతో పాటు, రోజంతా స్టేబుల్ గా ఉంచడానికి సహాయపడుతుంది.

అనారోగ్య సమస్యలు మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు వల్ల.. మనం మనకు తెలియకుండానే.. శరీరాన్ని లేజీగా మార్చి, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి కారణమవుతున్నాం.

No comments:

Post a Comment