వేసవి సీజన్ లో పచ్చిమామిడి విరివిగా దొరుకుతుంది. పచ్చిమామిడికాయతో ఊరగాయలు, సలాడ్స్, కర్రీస్ మరియు పులావ్ ను తయారుచేస్తారు . అంతే కాదు పచ్చిమామిడికాయతో వెరైటీగా పులావ్ రిసిపిని కూడా తయారుచేసుకోవచ్చు. తినడానికి రుచికరంగా, పుల్లగా టేస్టీగా ఉండే పచ్చిమామిడికాయ పులావ్ ను 20 నిముషాల్లో తయారుచేసేసుకోవచ్చు.
ఈ మ్యాంగో రైస్ రిసిపి కొద్దిగా పుల్ల మరియు వగరుగా ఉంటుంది. మరియు ఈ సమ్మర్ సీజన్ లో స్పెషల్ గా తయారుచేసుకొనే వంటల్లో మ్యాంగో రైస్ ఒకటి. కాబట్టి, ట్యాంగీ టేస్ట్ ను మీరు ఎంజాయ్ చేయాలంటే, ఈ మ్యాంగో రైస్ కు కావల్సిన పదార్థాలు, ఏవిధంగా తయారుచేయాలి తెలుసుకుందాం....
కావల్సిన పదార్థాలు:
పచ్చిమామిడికాయ - 1
వండిన అన్నం - 1 Bowl
పచ్చిమిర్చి - 5 to 6
ఆవాలు - 1/4th Teaspoon
పసుపు - 1/4th Teaspoon
వేరుశెనగలు- 1/2 cup
కరివేపాకు - 8 to 10
కొత్తిమీర - 8 to 10 (finely chopped)
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడగాలి.
2. తర్వాత పీలర్ తో అవుటర్ స్కిన్ ను తొలగించాలి.
3. ఇప్పుడు మామిడి కాయను గ్రేటర్ తో తురుముకోవాలి.
4. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, పల్లీలు ఒకదానికి తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.
5. తర్వాత అందులో పచ్చిమామిడికా తురుము వేసి మొత్తం మిశ్రమం ఫ్రై చేసుకోవాలి.
6. పోపుతో పాటు మామిడికాయ కొద్దిసేపు వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం , ఉప్పు వేయాలి.
7. మొత్తం మిశ్రం కలగలుపుకోవాలి .
8. చివరగా కొత్తిమీర తరగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి టేస్టీ మ్యాంగో రైస్ రెడీ...
No comments:
Post a Comment