Saturday, August 6, 2016

చర్మం నిగ నిగా మెరిసిపోవాలంటే ఇంత చిన్న టెక్నిక్కా...!

అలోవెరా జెల్ లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు.. చర్మానికి, జుట్టుకి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇవి చాలా మందంగా ఉంటాయి. వాటిని విడదీస్తే జెల్ వస్తుంది. ఆ జెల్ ని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అలాగే.. డైరెక్ట్ గా అప్లై చేసినా.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. 



ఆరోగ్యానికి, జుట్టుకి, చర్మానికి అలోవెరా జెల్ మిరాకిల్ చేస్తుందని చాలామందికి తెలుసు. అంతేకాదు.. అలోవెరా జ్యూస్ తాగినా.. క్యాన్సర్ రిస్క్ ని తగ్గించడంతో పాటు, అనేక జీర్ణసమస్యలను, ఎసిడ్ రిఫ్లక్స్ ని తగ్గిస్తుంది. కాన్ట్సిపేషన్ ని కూడా నివారిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా అలోవెరా జ్యూస్ అద్భుతంగా పేనిచేస్తుంది. దీనివల్ల బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. అలోవెరాను కాస్మొటిక్ ప్రొడక్ట్స్ లో చాలా వాటిలో ఉపయోగిస్తారు. 



అలోవెరా జెల్ లేదా జ్యూస్ ని అనేక క్రీములు, లోషన్స్, షాంపూలలో ఉపయోగిస్తారు. చాలా ప్రొడక్ట్స్ లో అలోవెరా జెల్ యాక్టివ్ ఇంగ్రిడియంట్ గా ఉంటుంది. అయితే మనం న్యాచురల్ గా అలోవెరా జెల్ ని 8 రకాలుగా ఉపయోగించవచ్చు. చర్మసంరక్షణకు అలోవెరా జెల్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించాలో చూద్దాం..

ర్యాషెస్ అలోవెరా జెల్ ని ర్యాషెస్ పై డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల.. అది కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. ర్యాషెస్ కి మాయిశ్చరైజర్ ని అందించి త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. రాత్రి పడుకోవడానికి ముందు అలోవెరా జెల్ పట్టించి.. ఉదయం వరకు అలానే ఉంచుకోవడం వల్ల.. ర్యాష్ పూర్తీగా నయం అవుతుంది.

సన్ బర్న్ ఎండకు కమిలిన చర్మాన్ని నివారించడంలో అలోవెరా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది.. రెడ్ నెస్ ని కూడా.. తగ్గిస్తుంది.

యాంటీ ఏజింగ్ వయసు పెరుగుతున్న లక్షణాలను తగ్గించడంలో.. అలోవెరా జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది.. చర్మానికి కొత్త కాంతిని ఇవ్వడంతో పాటు.. మాయిశ్చరైజర్ అందించి.. హైడ్రేట్ గా ఉంచుతుంది.

యాక్నె పెద్దవాళ్లైనా, టీనేజర్స్ అయినా.. యాక్నెతో ఇబ్బందిపడాల్సి వస్తుంటుంది. అయితే బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా అలోవెరా జెల్ అప్లై చేస్తే చాలు.. యాక్నె నివారించడం తేలికవుతుంది.

స్కార్స్ గాయాలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, గీతలను తొలగించడంలో అలోవెరా జెల్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కేవలం అలోవెరా జెల్ ని గాయాల వల్ల పడిన స్కార్స్ పై అప్లై చేస్తే చాలు.. ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

స్ట్రెచ్ మార్క్స్ అలోవెరా జెల్, విటమిన్ ఈ ఆయిల్ ని మిక్స్ చేసి.. స్ట్రెచ్ మార్క్స్ పై అప్లై చేస్తే.. అవి కనిపించకుండా మాయమవుతాయి. స్కార్స్ ని పూర్తీగా కనిపించకుండా చేయడంలో అలోవెరా జెల్ మిరాకిల్ చేస్తుంది.

సెల్యులైట్ అలోవెరా జెల్ సెల్యులైట్ ని తొలగించడంలోనూ గ్రేట్ గా పనిచేస్తుంది. అలోవెరా జెల్, కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకుని స్క్రబ్ తయారు చేసుకోవాలి. అంతే.. స్నానికి ముందు ఈ స్క్రబ్ ని ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

చుండ్రు డాండ్రఫ్ జుట్టు సమస్య కాకపోయినా.. స్కాల్ప్ సమస్య. చుండ్రు వల్ల.. ముఖంపై దుష్ర్పభావం ఉంటుంది. యాక్నెనేకి చుండ్రే ప్రధాన కారణమని చాలామంది డెర్మటాలజీస్ట్ లు నమ్ముతారు. కాబట్టి.. ముందుగా చుండ్రుని వదిలించుకోవాలి. అలాగే.. చుండ్రుని వదిలించడానికి అలోవెరా జెల్ ఉపయోగిస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

No comments:

Post a Comment