Friday, October 7, 2016

తెలంగాణ లో పెను సంచలనం

తెలంగాణలో  జిల్లాల పునర్వ్య వస్థీకరణ కొలిక్కి వచ్చింది. కొత్తగా 21 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లు, 119 మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ రూపకల్పన కూడా దాదాపుగా పూర్తయింది.  ఇక కొత్తగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సంబంధిత ఆవిష్కరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  గద్వాల జిల్లాకు ‘జోగులాంబ గద్వాల’గా పేరు నిర్ణయించారు. దసరా రోజున నోటిఫికేషన్ జారీ కానుంది.

 కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఆగస్టు 22న ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలు, డిమాండ్లతో జాబితాల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ముసాయిదాలో ప్రతిపాదించిన 17 జిల్లాలకు అదనంగా మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.  దసరా రోజున కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  ఇక ముసాయిదాతో పోలిస్తే మండలాలు, డివిజన్ల సంఖ్య కూడా పెరిగింది. ముసాయిదాలో కొత్తగా 46 మండలాలు, 15 డివిజన్ల ఏర్పాటును ప్రతిపాదించగా... కొత్త మండలాల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగి 119కి, కొత్త డివిజన్లు 21కి పెరిగాయి.

 21 కొత్త డివిజన్ల జాబితా

 మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి
 నిర్మల్ జిల్లా: భైంసా
 ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్
 కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్
 జగిత్యాల జిల్లా: మెట్‌పల్లి
 నాగర్‌కర్నూల్: కల్వకుర్తి, అచ్చంపేట
 వరంగల్ రూరల్ జిల్లా: వరంగల్ రూరల్
 మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్
 జనగాం జిల్లా: స్టేషన్ ఘన్‌పూర్
 సిద్దిపేట జిల్లా: గజ్వేల్
 మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్
 సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్, నారాయణఖేడ్
 కామారెడ్డి జిల్లా: బాన్సువాడ, ఎల్లారెడ్డి
 సూర్యాపేట జిల్లా: కోదాడ
 యాదాద్రి జిల్లా: చౌటుప్పల్
 మేడ్చల్ జిల్లా: కీసర
 శంషాబాద్ జిల్లా: కందుకూర్

 ప్రారంభ బాధ్యతలు ఎవరెవరికి?

 సీఎం కేసీఆర్: సిద్దిపేట, మెదక్
 మండలి చైర్మన్ స్వామిగౌడ్: వరంగల్ రూరల్
 స్పీకర్ మధుసూదనాచారి: భూపాలపల్లి
 డిప్యూటీ సీఎం మహమూద్: జగిత్యాల
 డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి: జనగామ
 నారుుని నర్సింహారెడ్డి: యాదాద్రి
 ఈటల రాజేందర్: పెద్దపల్లి
 పోచారం శ్రీనివాసరెడ్డి: కామారెడ్డి
 టి.పద్మారావు: మంచిర్యాల
 పి.మహేందర్‌రెడ్డి: శంషాబాద్
 కె.తారక రామారావు: సిరిసిల్ల
 జోగు రామన్న: ఆసిఫాబాద్
 జి.జగదీశ్‌రెడ్డి: సూర్యాపేట
 తుమ్మల నాగేశ్వర్‌రావు: కొత్తగూడెం
 ఇంద్రకరణ్‌రెడ్డి: నిర్మల్
 తలసాని శ్రీనివాస్‌యాదవ్: వనపర్తి
 సి.లక్ష్మారెడ్డి: నాగర్‌కర్నూల్
 అజ్మీరా చందూలాల్: మహబూబాబాద్
 జూపల్లి కృష్ణారావు: గద్వాల
 సీఎస్ రాజీవ్‌శర్మ: మల్కాజిగిరి (మేడ్చల్)

 జిల్లాలు.. వాటి పరిధిలోని మండలాలు

 1. ఆదిలాబాద్ జిల్లా (18 మండలాలు)
 ఆదిలాబాద్ అర్బన్ (కొత్త మండలం), ఆదిలాబాద్ రూర ల్,  మావల (కొత్త), గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బేల, బోథ్, జైనథ్, తాంసి, భీంపూర్(కొత్త), తలమడుగు,  నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ (కొత్త), ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ (కొత్త), ఊట్నూర్
 2. మంచిర్యాల జిల్లా (18)
 చెన్నూర్, జైపూర్, భీమారం (కొత్త), కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్(కొత్త), హాజీపూర్ (కొత్త), మందమర్రి, దండేపల్లి, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తాండూరు, భీమిని, కన్నెపల్లి
 3. నిర్మల్ జిల్లా (18)
 నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్ (కొత్త), సోన్ (కొత్త), దిలావర్‌పూర్, నర్సాపూర్-జి (కొత్త), కడెంపెద్దూర్, దస్తూరాబాద్ (కొత్త), ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగపూర్, కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, బాసర (కొత్త), లోకేశ్వరం, తానూర్.
 4. ఆసిఫాబాద్ (కొమురంభీం జిల్లా)(15)
 కాగజ్‌నగర్, సిర్పూర్-టి, దహెగాం, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి (కొత్త), పెంచికల్‌పేట(కొత్త), ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి
 5. కరీంనగర్ జిల్లా(16)
 కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మానకొండూర్, తిమ్మాపూర్, వడ్లూరు బేగంపేట (బెజ్జంకి), గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, వీణవంక, వి.సైదాపూర్,
శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట
 6. జగిత్యాల జిల్లా (18)
 జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగపూర్, బీర్‌పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్
 7. పెద్దపల్లి జిల్లా (14)
 పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, రత్నాపూర్, మంథని, ముత్తారం
 8. సిరిసిల్ల (రాజన్న జిల్లా)(13)
 సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్ (కొత్త), వేములవాడ, వేములవాడ రూరల్ (కొత్త), చందుర్తి, రుద్రంగి (కొత్త), కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట,
బోయినపల్లి, వీర్నపల్లి (కొత్త)
 9. మహబూబ్‌నగర్ జిల్లా(21)
 మూసాపేట, భూత్పూరు, హాన్వాడ, కోయల్‌కొండ, మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ రూరల్, నవాబ్‌పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, గండేడ్, దేవరకద్ర, నారాయణపేట,
దామరగిద్ద, ధన్వాడ, మరికల్, దౌల్తాబాద్, కొస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ
 10. వనపర్తి జిల్లా(17)
 వనపర్తి, గోపాలపేట, పెద్దమందడి, ఘన్‌పూర్, కొత్తకోట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, చిన్న చింతకుంట, ఆత్మకూర్, అమరచింత, మదనపూర్, కోడేరు, అడ్డాకుల, అలంపూర్, ఉండవెల్లి, ఏదుల
 11. నాగర్‌కర్నూల్(22)
 బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, గొల్లాపూర్, చిన్నంబావి, పెంటవెల్లి, కల్వకుర్తి, మిడ్జిల్, ఉరుకొండ, వెల్దండ, వంగూర్, చారుకొండ, అచ్చంపేట, అమ్రాబాద్, పదిర, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, సిద్ధాపూర్
 12. గద్వాల (జోగులాంబ) జిల్లా(13)
 గద్వాల, ధరూర్, గట్టు, మల్దకల్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, నందిన్నె (కొత్త), రాజోలి(కొత్త), కృష్ణ, మాగనూర్, మక్తల్
 13. వరంగల్ అర్బన్ జిల్లా (12)
 వరంగల్, ఖిలా వరంగల్ (కొత్త), హన్మకొండ, కాజీపేట (కొత్త), హసన్‌పర్తి, ఐనవోలు (కొత్త), ధర్మసాగర్, వేలేరు (కొత్త), భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, ఇల్లంతకుంట (కొత్త)
 14. వరంగల్ రూరల్ (కాకతీయ) జిల్లా (14)
 వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, శాయంపేట, పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపూర్, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ
 15. భూపాలపల్లి (జయశంకర్) జిల్లా (19)
 భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, ఘణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం(కొత్త), మంగపేట, కాటారం, మల్హర్‌రావు, మహాముత్తారం, మహదేవపూర్, వెంకటాపురం (ఖమ్మం), వాజేడు
 16. మహబూబాబాద్ జిల్లా (16)
 మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం, చిన్నగూడురు (కొత్త), దంతాలపల్లి (కొత్త), పెద్దవంగర(కొత్త), గంగారం (కొత్త)
 17. జనగాం జిల్లా (13)
 జనగాం, లింగాల ఘన్‌పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల(కొత్త), రఘునాథ్‌పల్లి, గుండాల, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూరు(కొత్త), జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల
 18. సిద్దిపేట జిల్లా (22)
 సిద్దిపేట, సిద్దిపేట రూరల్, నంగునూర్, చిన్నకోడూరు, తొగుట, దౌలతాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, హుస్నాబాద్, కోహెడ, శనిగరం, హుస్నాబాద్ రూరల్ (అంతక్కపేట), గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోల్, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి
 19. మెదక్ జిల్లా (20)
 మెదక్, హవేలీ ఘన్‌పూర్, పాపన్నపేట, శంకరంపేట రూరల్, శంకరంపేట(ఏ), టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు, రామాయంపేట, నిజాంపేట, ఎల్దుర్తి, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి, నర్సాపూర్, శివంపేట, కోడిపల్లి, కుల్చారం, చిల్పిచేడ్
 20. సంగారెడ్డి జిల్లా (26)
 సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపూర్, జిన్నారం, గుమ్మడిదల, పుల్కల్, ఆందోల్, వట్‌పల్లి, మునిపల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాలకల్, ఝరాసంఘం, కోహిర్, రాయ్‌కోడ్, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూర్, నాగిల్‌గిద్ద
 21. నిజామాబాద్ జిల్లా (26)
 నిజామాబాద్, నందిపేట, మాక్లూర్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, రుద్రూరు (కొత్త), కోటగిరి, డిచ్‌పల్లి, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీంగల్, సిరికొండ, ధర్పల్లి, మెండోరా (కొత్త), ఇందల్వాయి (కొత్త), ఆలూరు(కొత్త), ముగ్పల్ (కొత్త), నిజామాబాద్ ఉత్తరం (కొత్త), నిజామాబాద్ రూరల్ (కొత్త)
 22. కామారెడ్డి జిల్లా (19)
 కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూరు, బీర్కూరు, ఎల్లారెడ్డి, బిచ్కుంద, సదాశివనగర్, రామారెడ్డి (కొత్త), రాజంపేట(కొత్త)
 23. నల్లగొండ జిల్లా(31)
 చండూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, నార్కట్‌పల్లి, తిప్పర్తి, కేతేపల్లి, శాలిగౌరారం, గట్టుప్పల, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల, నిడమనూరు, పెదవూర, త్రిపురారం, మాడ్గులపల్లి, తిరుమలగిరి సాగర్, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి (డిండి), గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పెద్ద అడిశర్లపల్లి, నేరేడుగొమ్ము
 24. సూర్యాపేట జిల్లా (23)
 ఆత్మకూరు (ఎస్), చివ్వెంల, జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, చిలుకూరు, హుజూర్‌నగర్, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి. మద్దిరాల, పాలకీడు, చింతలపాలెంయ(మల్లారెడ్డిగూడెం)
 25. యాదాద్రి జిల్లా (15)
 ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, ఆత్మకూరు (ఎం), భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్, అడ్డగూడూరు, నారాయణపూర్
 26. ఖమ్మం జిల్లా (21)
 ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, కామేపల్లి, రఘునాథపాలెం (కొత్త), కారేపల్లి, సింగరేణి
 27. కొత్తగూడెం (భద్రాద్రి) జిల్లా (24)
 చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, అశ్వాపురం,
బూర్గంపాడు, మణుగూరు, పినపాక, సుజాతానగర్, చెంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కరకుగూడెం, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు
 28. వికారాబాద్ జిల్లా (17)
 వికారాబాద్, మోమిన్‌పేట్, మర్పల్లి, పూడూరు, ధారూర్, బంట్వారం, కోట్‌పల్లి, నవాబ్‌పేట్, కుల్కచర్ల, దోమ, పరిగి, తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, బొంరాసిపేట్, కొడంగల్
 29. శంషాబాద్ (రంగారెడ్డి) జిల్లా (26)
 మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, కొందుర్గు, షాబాద్, చౌదరిగూడ, శేరిలింగంపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు, షాద్‌నగర్, కేశంపేట్, గండిపేట్, కందుకూరు, మహేశ్వరం,
ఆమన్‌గల్, కడ్తాల్, తలకొండపల్లి, సరూర్‌నగర్, బాలాపూర్, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల
 30. మేడ్చల్ జిల్లా (14)
 మల్కాజిగిరి, మేడ్చల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, దుండిగల్, నిజాంపేట్, కూకట్‌పల్లి, అల్వాల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, ఉప్పల్, జవహర్‌నగర్, మేడిపల్లి, కాప్రా
 31. హైదరాబాద్ జిల్లా(16)
 అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, షేక్‌పేట్, తిరుమలగిరి, మారేడుపల్లి

Thursday, October 6, 2016

అలా అయితే కోటీశ్వరుడు కావచ్చంటారా

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు-4’ షో ప్రారంభం కాబోతోంది. ఈ షో తొలి ప్రోమోను మాటీవీ శనివారం రాత్రి లాంచ్ చేసింది.

‘వెండితెర మీద మీరు నన్ను గెలిపించారు. బుల్లితెర మీద మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను.. కమాన్.. లెటజ్ ప్లే’ అంటూ మెగాస్టార్ ఈ ప్రోమోలో సవాల్ చేశాడు. నాగార్జున తరువాత ఇక చిరు హోస్ట్‌గా ఈ షోను రక్తి కట్టించనున్నాడు. డిసెంబరు 12 నుంచి ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి.

Wednesday, October 5, 2016

ఆ హీరోయిన్ తెగేసి చెప్పిందా,,?

వంట్లో గ్లామర్ ఉండగానే ఇంట్లో దీపం  చక్కబెట్టుకోవాలనే పెద్దల మాట యాజిటీజ్ గా ఫాలో అయిపోతోందట సౌత్ బ్యూటీ  నయనతార.  అయితే గ్లామర్ ఫేడవుట్ కాకముందే  నాలుగు సినిమాల్లో కనిపించి   నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనేది హీరోయిన్ల బాట. అవును నయనతార ఇప్పుడు ఈ మంత్రాన్నే పాటిస్తోందట. సాధారణంగా మూడు పదుల వయస్సుకొచ్చే సరికి హీరోయిన్ల మార్కెట్ డౌన్ అయిపోతున్న పరిస్థితి కనిపించడంతో నయనతార ఇక్కడే జాగ్రత్తపడింది.



30ఏళ్లు దాటినా.. తనలో గ్లామర్ తగ్గకుండా ఉండేందుకు  హెవీ వర్కవుట్స్ చేసిందట. దీంతో నిన్న మొన్నటి  దాకా  ముద్దుగా, బొద్దుగా కనిపించిన  నయన్  టాప్ హీరోల  సరసన అందాలు ఆరబోస్తూ న్యూ జనరేషన్  తో అయినా రెడీ అనేస్తుండటం తో  నిర్మాతలు నయనతార ఇంటి బాట పట్టారని టాక్. పనిలో పనిగా డిమాండ్ పెరగడంతో.. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందట నయన్..అంటే ఒకటీ అరా. కాదు.ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట.దీంతో సౌత్ లో  హైయ్యస్ట్  రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ కెక్కిందినయనతార .రీసెంట్ గా  ఓ నిర్మాత కాల్షీట్ కోసం వెళ్తే రూ.4కోట్లు ఇస్తేనే  ఏదైనా ..అని తెగేసి  చెప్పిందని సమాచారం.

Monday, October 3, 2016

పవన్ కు త్రివిక్రమ్ ఆఫర్ అంత బాగుంటుందా



పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ అంటే ఎనలేని క్రేజ్‌ ఉంటుంది. గతంలో వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు సూపర్‌హిట్‌లుగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, తమ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కోసం త్రివిక్రమ్‌ చాలా కష్టపడుతున్నాడట. ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని కసి మీద ఉన్నాడట.
 
పవన్‌ ప్రస్తుతం చేస్తున్న ‘కాటమరాయుడు’ నుంచి ఫిబ్రవరికి ఫ్రీ అవుతాడు. ఈ లోపు త్రివిక్రమ్‌ తలుచుకుంటే వేరే హీరోతో సినిమా చేసేయగలడు. కానీ, ఈ టైమంతా పవన్‌ సినిమా కోసమే కేటాయించాలని డిసైడ్‌ అయ్యాడట. వంద శాతం ఎఫర్ట్‌ అంతా పవన్‌ కోసమే ధారపోస్తున్నాడట. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్‌ దాదాపు పూర్తైపోయిందట. దానికి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట. ఆ తర్వాత లోకేషన్‌ వేట మొదలెడతాడట. ఇక, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాడట.

Friday, September 30, 2016

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి:ఈవో


తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం తిరుమలలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని... 3న  ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

మూడో తేదీన స్వామివారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకుర 24 గంటలూ ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయని సాంబశివరావు వెల్లడించారు.

Thursday, September 29, 2016

నవరాత్రి స్పెషల్: కొబ్బరి బొబ్బట్టు

నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కొక్క స్వీటు చేసి దుర్గా మాతకి నైవద్యం పెడతారు. ఖన్నుల పండుగగా ఉండే ఈ దసరా నవరాత్రుల కోసం అందరూ ఉంత్సాహంగా ఎదురు చూస్తారు. ఖొబ్బరి పూరన్ పోలీ లేదా కొబ్బరి బొబ్బట్ల తయారీ విధానమెలాగో ఈరోజు మీకు చెప్పబోతున్నాము. 



ఈ బొబ్బట్ల తయారెకై కావాల్సినవి కొబ్బరి, మైదా, బెల్లం.నవరాత్రుల్లో ఉత్తర భారత దేశ ప్రజలు ఉపవాసం చేస్తారు. ఊపవాస సమయంలో తీసుకునే ఆహారంలో చాలా నియమాలుంటాయి. మైదా లేదా గోధుమ పిండిని కొంతమంది ఉపవాస సమయంలో తీసుకోరు. 



ఇక ఈ బొబ్బట్టు తయారీ చూద్దామా... ఎంత మందికి సరిపోతుంది-4 వండటానికి పట్టే సమయం-45 నిమిషాలు సామాగ్రి సమకూర్చుకోవడానికి-30 నిమిషాలు. 



కావాల్సిన పదార్ధాలు. 
మైదా-ఒక కప్పు పసుపు-1/4 టీ స్పూను 
నీళ్ళు-ఒక కప్పు 
కొబ్బరి నూనె-ఒక టీ స్పూను
బెల్లం-ఒక కప్పు 
తాజా తురిమిన కొబ్బరి-ఒక కప్పు 
దంచిన ఏలకులు-కొన్ని నెయ్యి 
మరియూ ఉప్పు. 



తయారీ విధానం: 

1. ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, ఉప్పు,పసుపు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ కలపాలి. పిండి కలిపాకా దానిలో కొబ్బరి నూనె వేసి మరికాస్త కలపాలి.ఈ కలిపిన పిండిని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 

2. తాజా కొబ్బరిని తురుముకోవాలి లేదా మిక్సీ ఉపయోగిస్తున్నట్లయితే నీళ్ళు పొయ్యకుండా తురుములాగ చేసుకోవాలి. 

3. ఒక గిన్నెలో నీళ్ళూ తీసుకుని బెల్లం వేసి కరిగేంతవరకూ స్టవ్ మీద పెట్టాలి. 

4. మలినాలుంటే తొలగించడానికి కరిగిన బెల్లం మిశ్రమాన్ని వడకట్టాలి. వడకట్టిన మిశ్రమంలో తురిమిన తాజా కొబ్బరి, దంచి పెట్టుకున్న ఏలకులు వెయ్యాలి. 

5. కొబ్బరి కలిపిన బెల్లాన్ని మరలా పొయ్యి మీద పెట్టి తేమ పోయి దగ్గర పడేంతవరకూ ఉడికించుకోని చల్లారనివ్వాలి. 

6. కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ప్యాటీ లాగ చేసి దానిలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి ఉబ్బెత్తుగా లేకుండా మెల్లిగ తట్టాలి.ఇలాగే మిగిలిన పిండితో కూడా చేసుకోవాలి. 

7. ఇప్పుడు చపాతీ వత్తుకునే పీట మీద కొంచం పిండి వేసి ఫిల్లింగ్ చేసి పెట్టుకున్న ప్యాటీలని కాస్త మందంగా బొబ్బట్ల లాగ వత్తుకోవాలి. 

8. పెనం మీద నెయ్యి వేసి వత్తుకున్న బొబ్బట్టుని దోరగా కాల్చుకోవాలి. కాల్చిన బొబ్బట్ల మీద నెయ్యి వేసి సర్వ్ చెయ్యడమే.

Wednesday, September 28, 2016

కొత్తీమీరే కదా అనుకోకండి...

కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. 



కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. 



అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొకొత్తిమీర ఆకులలో ప్రొటీన్లు, కొవ్వు, మినరల్స్, పీచు, కార్బోహైడ్రేట్లు, నీరు వుంటాయి. మినరల్స్, విటమిన్లు పరిశీలిస్తే వాటిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటీన్, ధయామైన్, రిబోఫ్లావిన్, నయాసిన్, సోడియం, పొటాషియం, ఆక్సాలిక్ యాసిడ్ లు వుంటాయి. కొత్తిమీర ఆకు ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. టానిక్ ల వలే పనిచేస్తుంది. అవి పొట్ట గడబిడను దూరం చేస్తాయి. బలపరుస్తాయి. మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. 



తాజా కొత్తిమీరలో దాగున్న ఆరోగ్య రహస్యాలు: డయేరియా తగ్గిస్తుంది: కొత్తిమీరలో ఉండే బోర్నియోల్, లినానోల్, జీర్ణశక్తిని పెంచడంలో, లివర్ సక్రమంగా పనిచేయడానికి డయేరియాను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డయోరియాతో బాధపడే వారు కొత్తమీర జ్యూస్ తాగడం వల్ల డయోరియా కంట్రోల్ అవుతుంది. 

చర్మ సమస్యలు నివారిస్తుంది: చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది. 

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రిబ్యూట్ చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గించుకోవడం వల్ల హార్ట్ సమస్యలుండవు. 

అనీమియా తగ్గిస్తుంది: కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది. 
మౌత్ అల్సర్ తగ్గిస్తుంది: కొత్తమీరలో ఉండే ముఖ్యమైన గుణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా గాయాలను లేదా నోటి అల్సర్స్ ను తగ్గిస్తుంది. ఉదయం కొత్తిమీరను తినడం వల్ల రోజుకు మూడుసార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. అల్సర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. 

బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది: కొత్తిమీరలో ఉండే క్యాల్షియం, బోన్స్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఇతర మినిరల్స్, బోన్ హెల్త్ కు సహాయపడుతాయి. డ్యూరబులిటిని పెంచుతాయి. . 

జీర్ణ శక్తిని పెంచుతుంది: కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి కొత్తిమీర సహకరిస్తుంది. అలాగే మధుమేహంతో బాధపడేవాళ్లకు కొత్తిమీర మంచి ఔషధం. రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది. కొత్తిమీరను ఇష్టపడేవాళ్లు దాని రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

కళ్ళ ఆరోగ్యానికి మంచిది: కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. 

చికెన్ పాక్స్ నివారిస్తుంది: కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు ఇతర యాంటీఆక్సిడెంట్స్ కళ్ళు మంచిది, కొత్తిమీరలో ఉండే మినిరల్స్ కారణంగా కంటి సమస్యలను దూరం చేస్తుంది. కళ్ళ అలసటను, ఒత్తిడిని తగ్గిస్తాయి. 

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.