Saturday, September 24, 2016

డేంగ్యూ ఫీవర్ తో బాధపడే వారి రక్తంలో ఫ్లేట్ లెట్స్ ను పెంచే 7 హెర్బ్స్

రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. రక్తం గడ్డకట్టడానికిఉపయోగపడే ఇవి మీ జీవితంలోనూ ఇప్పటికే మీ ప్రాణాలను అనేక సార్లు మౌనంగా కాపాడే ఉంటాయి. మీరు ఇప్పటికే డేంగ్యూ ఫీవర్ గురించి వినే ఉంటారు. ఈ ఫీవర్ వచ్చినప్పుడు, శరీరంలో ప్లేట్ లెట్ స్థాయిలో తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాధం ఏర్పడుతుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను టెక్నికల్ గా థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు . ఈ వైరస్ కు కారణం జన్యుపరమైన, మెడికేషన్స్, ఆల్కహాల్, వైరస్, గర్భాధారణ మరియు ఇతర కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అలా వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా, లేదా ప్లేట్ లెట్ స్థాయిలు తగ్గకుండా ఉండాలన్నా, ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. 

శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు అతి తక్కువ సమయంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ది చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడవ వల్ల నేచురల్ గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. 

ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడేవారు, తప్పనిసరిగా అధిక విటమిన్స్ మరియు మినిరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా శరీరం ఎక్కువ ప్లేట్ లెట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అది అనారోగ్యకరమైన శరీరం నుండి తర్వగా కోలుకొనేందుకు సహాయపడుతుంది . 

ప్లేట్ లెట్స్ ను నేచురల్ గా అభివృద్దిపరుచుకోవడం కోసం ఈ క్రింద కొన్ని ప్రత్యేకమైన హెర్బల్ రెమెడీస్ ను ఇవ్వడం జరిగింది. మీలో ప్లేట్ లెట్స్ తగ్గాయని తెలుసుకోగానే, వెంటనే ఐరన్ పుష్కలంగా ఉన్న రెండు ఆహారాలు, హెర్బల్ రెమెడీస్ తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ పవర్ ఫుల్ హెర్బల్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం... 



బొప్పాయి: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. అందుకు మీరు చేయాల్సిండి బొప్పాయి ఆకులను జ్యూస్ ను త్రాగడం లేదా బొప్పాయి ఆకులను కొద్దిగా నీళ్లు పోసి మీడియం మంట మీద ఉడికించాలి. ఆ నీటిని వడగట్టి రోజుకు రెండు సార్లు త్రాగడం వల్ల ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. 



వీట్ గ్రాస్: వీట్ గ్రాస్ హెర్బ్, దీన్నే గోధుమ గడ్డి అనిపిలుస్తారు, దీన్నె రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ప్లెట్ లెట్ కౌంట్ పెరుగుతుంది, వీట్ గ్రాస్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ పెరుతుంది. ఇంకా ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకనాలకు సపోర్ట్ చేస్తుంది. 



ఆకు కూరలు: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, కాలే మరియు ఇతర గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ ను అభివృద్ది పరచుకోవచ్చు. 



ఉసిరికాయ: ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది. వేగంగా.. డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది. 



గుడుచి: శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి.. జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి. 



తులసి: డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి తులసి ఆకులు చక్కటి పరిష్కారం. రోజుకి రెండు సార్లు.. 10 నుంచి 15 తులసి ఆకులు నమలడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 



aఅలోవెర: అలోవెరా ఎమినో యాసిడ్స్ పెంచి, బ్లడ్ ప్లేట్లెట్ లెవెల్స్ ని పెంచుతుంది. డెంగ్యూ ఫీవర్ బారిన పడినవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ముందు బ్లడ్ ప్లెట్లెట్స్, ఎమినో యాసిడ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి.

No comments:

Post a Comment