Friday, July 29, 2016

వర్షాకాలంలో ఆహారాలు చెడిపోకుండా భద్రపరచడానికి జనరల్ టిప్స్

వర్షాకాలంలో ఆహారం చాలా తొందరగా చెడిపోతుంది. ఆహారాన్ని తాజాగా ఉంచటానికి చాలా పని చేయవలసి ఉంటుంది. అయితే ఆహారాన్ని తాజాగా ఉంచటానికి ఈ క్రింద ఉన్న కొన్ని సూచనలను అనుసరించండి.

వర్షాకాలంలో ఆహారం పట్ల శ్రద్ద తీసుకోకపోతే మీ కుటుంబంలోని వారికీ వ్యాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 


ఇక్కడ మీ ఆహారం నిల్వ ఉంచటానికి మరియు వ్యాధులను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఎక్కువ మొత్తంలో వండకూడదు 

ఏడాదిలో వర్షాకాలం సమయంలో ఆహారం చాలా సులభంగా ఫంగస్ కు ప్రభావితమవుతుంది. అంతేకాకుండా నగర వాతావరణంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండుట వలన ఆహారం తొందరగా చెడిపోతుంది. దీనికి ఉత్తమ మార్గం ఏమిటంటే మనకు సరిపడే పరిమాణంలో మాత్రమే ఆహారంను వండుకోవాలి. ఒకవేళ మిగిలిపోతే ఇంటిలో పనిచేసేవారికి పెట్టాలి.

రిఫ్రిజరేటర్లో పొడి పదార్దాలను పెట్టండి 

రవ్వ,మైదా వంటి పొడి పదార్దాలను ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అలాగే వర్షాకాలంలో రవ్వను కొంచెం వేగించి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. అలాగే శనగపిండిని కూడా బాగా జల్లించి గాలి చొరని డబ్బాలలో పోసి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన ఫంగస్ ను నివారించవచ్చు.



ఉత్ప్రేరకాలను ఉపయోగించాలి

వర్షాకాలంలో కీటకాలు లేదా పురుగులు నుండి కాయధాన్యాలను సేవ్ చేసేందుకు,వాటిని నిల్వ చేసే ముందు ఆవాల నూనెను రాయాలి. తాజా ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే క్రమంలో వాటికీ కొంత ఆముదమును చల్లాలి. అయితే ఆముదం ఎక్కువగా కాకుండా ఒక నిర్దిష్ట మొత్తంలో తీసుకోని చూడటానికి ప్రకాశవంతముగా ఉండేలాగా మాత్రమే జాగ్రత్తగా రాయాలి. నట్స్ తేమ కారణంగా మెత్తగా మారతాయి. వాటిని మైక్రోవేవ్ లో వేడి చేస్తే,అవి కొన్ని నిమిషాల తర్వాత క్రిస్పి గా మారతాయి.



వండిన ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

వండిన ఆహారంలో బాక్టీరియా చేరకుండా ఉండటానికి,రెండు గంటలకు ఒకసారి మూత తీసి వండిన ఆహారంను కలుపుతూ ఉండాలి. చపాతీలు నాచు పట్టకుండా ఉండటానికి వార్తాపత్రికలు లేదా సిల్వర్ ఫాయిల్ పేపర్ తో చుట్టాలి. ఈ సీజన్ లో ఆహరం చెడిపోతుంది. కాబట్టి ఆహారం నిల్వ ఉంచినప్పుడు తప్పనిసరిగా కవర్ చేయాలి. అప్పడాలు వేగించిన తర్వాత,ఎక్కువసేపు క్రిస్పిగా ఉండాలంటే వాటిని ఒక జిప్ లాక్ ప్యాకెట్లలో నిల్వ చేయాలి.

మూతలు తప్పనిసరిగా ఉంచాలి 

మీ ఆహారాలను వండటానికి ముందు, తర్వాత కవర్ చేయాలి. లేకపోతె మీ ఆహారానికి మరియు ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పు ఉంటుంది.

వండటానికి ముందు శుభ్రం కడిగి తడి ఆరనివ్వాలి

కూరగాయలు మరియు పండ్లను శుభ్రంగా కడగాలి. వీటిని ఉపయోగించడానికి ముందు మరియు ఫ్రిడ్జ్ లో పెట్టటానికి ముందు బాగా ఆరనివ్వాలి.

No comments:

Post a Comment